డిసెంబర్లో నాయక్ ఫైనల్ షెడ్యూల్


2013 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు సిద్దమవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘నాయక్’ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఒక పాటను మరియు క్లైమాక్స్ సీక్వెన్స్ ని తీయనున్నారు. మిగిలిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయ్యింది. ఈ మాస్ మసాల ఎంటర్టైనర్లో రామ్ చరణ్ తో కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ రోమాన్స్ చేస్తున్నారు.

మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందించారు. మేము ఇది వరకే తెలియజేసినట్టు ఈ సినిమాకి విడుదలకి ముందే మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. రామ్ చరణ్ మునుపటి చిత్రం ‘రచ్చ’ కమర్షియల్ సక్సెస్ కూడా ఈ మూవీ బిజినెస్ విషయంలో డి.వి.వి దానయ్యకి హెల్ప్ అయ్యింది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక డిసెంబర్ 14న హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ఎత్తున జరగనుంది.

Exit mobile version