మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా తన మార్క్ ని చూపించనున్నాడు. మన యంగ్ హీరో రామ్ చరణ్ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
చరణ్ ముఖ్యంగా రెండు విషయాల్లో సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. అందులో ఒకటి సినిమా రన్ టైం – రెండవది అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్. ఈ సినిమా రన్ టైం కేవలం రెండు గంటలే కావడం వల్ల బోర్ కొట్టించే సీన్స్ ఉండటానికి చాన్స్ ఉండదు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే మేజర్ హైలైట్ అవుతాయని భావిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అదిరిపోయే స్టంట్స్ చేసాడు. అపూర్వ లాఖియా డైరెక్ట్ చేసిన ఈ పవర్ఫుల్ పోలీస్ డ్రామాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 6న హిందీ, తెలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.