ఈ మధ్య సినిమాలు చేయడంలో వెనుకబడిన శ్రియ సరన్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిన ‘చంద్ర’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. రూప అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఒకేసారి కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రియ ప్రత్యేకంగా కలరీ ఫైట్ కూడా నేర్చుకుంది.
ఈ సినిమా ఒక పీరియాడికల్ సినిమా అని వస్తున్న వార్తల్ని డైరెక్టర్ అయ్యర్ కొట్టి పారేశారు. ‘ ‘చంద్ర’ పీరియాడికల్ సినిమా కాదు. ఈ సినిమా కథ మొత్తం రాజవంశంలోని చివరి యువరాణి చుట్టూ తిరుగుతుంది. కాస్త నేటితరానికి తగ్గట్టుగా ఉంటుందని’ తెలిపింది.