సైనాకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

సైనాకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

Published on Aug 4, 2012 11:40 PM IST


ఒలింపిక్స్ కి అర్హత సాదించిన రోజు నుండి అందరి కళ్ళు సైనా నెహ్వాల్ మీద ఉన్నాయి. సైనా పతకం తెస్తుందని దాదాపుగా అందరు అంచనా వేశారు. ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ లోకి ప్రవేశించిన తొలి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. కాని ఫైనల్స్ లోకి వెళ్ళలేకపోయింది. ఈరోజు జిన్ వాంగ్ తో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జిన్ వాంగ్ గాయంతో తప్పుకొనగా కాంస్య పతకం సైనా సొంతం అయ్యింది. ఈ విషయం తెలియగానే పలువురు ప్రముఖులు ఆమెని మరియు ఆమె ఆటతీరుని ప్రశంసించారు. మీకోసం వారు ట్విట్టర్లో చెప్పిన శుభాకాంక్షల సందేశాలు కొన్ని :

సైనా అద్భుతమయిన ప్రదర్శన కనబరిచింది. భారత దేశానికి ఒలింపిక్ పతకం తెచ్చిపెట్టిన రెండవ క్రీడాకారిణి అయింది. పుల్లెల గోపీచంద్ కి కూడా శుభాకాంక్షలు. – సచిన్ టెండూల్కర్

వెండి పతకం గెలిచిన విజయ్ కుమార్ కి మరియు సైనా కి నా శుభాకాంక్షలు దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది – ఐశ్వర్య ధనుష్

కాంస్య పతకం గెలిచినందుకు గాను సైనా నెహ్వాల్ కి శుభాకాంక్షలు. ప్రస్తుతం మన ఖాతాలో రెండు కాంస్య పతకాలు మరియు ఒక వెండి పతకం ఉంది జయ హో – అల్లరి నరేష్

సైనా కాంస్యం గెలుచుకుంది. మన ఖాతాలో మరొక పతాకాన్ని జత చేసిందుకు సైనాకి ధన్యవాదాలు మమ్మల్ని గర్వపడేలా చేసావు – కుష్బూ

సైనా అంకిత భావం కష్టపడే తత్వం మరియు ఓపిక ఈ పతాకాన్ని తెచ్చిపెట్టాయి మాకు చాలా గర్వంగా ఉంది – రాహుల్

బాడ్మింటన్! బంగారం మరియు వెండి చైనా సొంతం అయితే కాంస్యం సైనా సొంతం అయ్యింది – అరవింద్ స్వామి

సైనా నెహ్వాల్ మనకి కాంస్య పతకం గెలిచిపెట్టింది ఆ గాయపడ్డ చైనా క్రీడాకారిణి గురించి భాధగా ఉన్నా సైనా కి దక్కాల్సింది దక్కింది – నిఖిల్

కాంస్య పతకం గెలిచినందుకు సైనా కి శుభాకాంక్షలు మేమంతా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం – ప్రియమణి

తాజా వార్తలు