మీకు సచిన్ జోషి గుర్తున్నాడా? గతంలో ‘మౌనమేలనోయి’, ‘నిను చూడక నేనుండలేను’ సినిమాలతో తెలుగు వారికి హీరోగా పరిచయమయినప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం విజయాన్ని అందుకోలేకపోయాడు. కానీ సచిన్ జోషి స్వతహాగా మంచి బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల సిసిఎల్ 4 సీజన్ లో తెలుగు వారియర్స్ టీంని కొనుక్కున్నారు.
సిసిఎల్ 4 తో మళ్ళీ తెలుగు వారికి దగ్గరైన సచిన్ జోషి ఓ మంచి మూవీతో తెలుగులో కమ్ బ్యాక్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘ఆశికి 2’ తెలుగు రీమేక్ లో సచిన్ జోషి హీరోగా నటించనున్నాడు. గత సంవత్సరం బాలీవుడ్ లో వచ్చిన ‘ఆశికి 2’ సూపర్ హిట్ అయ్యింది. మార్చి నుంచి సెట్స్ పైకి వెల్ల నున్న ఈ సినిమా బండ్ల గణేష్ సమర్పణలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.