బిగ్ న్యూస్ : సుశాంత్ కేసులో తుది తీర్పు తేల్చేసిన సిబిఐ.!

గత జూన్ నెలలో దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంచలన సంఘటన బాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన. ఎన్నో కీలక మలుపులు డిమాండ్స్ నడుమ ఈ మిస్టరీ కేసు సిబిఐ చెంతకు చేరింది. దీనితో ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్నది తేలుతుంది అని సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు భావించారు.

అయితే గత కొన్ని రోజుల కితమే ఎయిమ్స్ వారు ఇది హత్య కాదు ఆత్మహత్య అని రిపోర్ట్ అందించారు. కానీ ఆ సమయానికి సిబిఐ వారు ఇంకా ఎలాంటి నివేదికను అందించలేదు. కానీ ఇపుడు వారు ఈ కేసును తేల్చేశారట. సుశాంత్ ది హత్యా కాదు ఆత్మహత్యే అని వారు తెలిపారు.

తాము హత్యా కోణంలోనే విచారణ చేసినప్పటికీ వారికి అదే హత్యే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సుశాంత్ మానసికంగా వేదనకు గురయ్యే చనిపోయాడని ముగించేశారు. ఇదిలా ఉండగా ఇదే రోజున బైలు మీద సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా డ్రగ్స్ కేసులో జైలు నుంచి విడుదల కానుంది.

Exit mobile version