టాలీవుడ్లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఎడి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించింది. అయితే, ఇటీవల ఈ సినిమా నుండి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
దీంతో ఇప్పుడు ఆమె చేసిన పాత్రను ఎవరు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, నాగ్ అశ్విన్ ఈ పాత్ర కోసం తొలుత ఆలియా భట్‌ను తీసుకోవాలని అనుకున్నాడట. కానీ, ఆమె ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆమె స్థానంలో వేరొక హీరోయిన్ కోసం చూస్తున్నాడట. అయితే, సాయి పల్లవి ఈ పాత్ర చేస్తే బాగుంటుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట.
మరి నాగ్ అశ్విన్ సాయి పల్లవిని ఈ సినిమా కోసం అప్రోచ్ అవుతాడా.. సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.