‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..?

‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..?

Published on May 29, 2025 3:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా పవన్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ కావడం ఖాయమని వారు భావిస్తున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు