
మొదటి చిత్రం ‘ఈ రోజుల్లో’తో యువతని ఆకట్టుకున్న దర్శకుడు మారుతి రెండో ప్రయత్నంగా రాబోతున్న చిత్రం ‘బస్ స్టాప్’. ప్రిన్స్, శ్రీ విద్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా యువతను ఆకట్టుకునే విధంగా తెరకెక్కింది. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్, బి. మహేంద్ర బాబు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమాకి పనిచేసిన సంగీత దర్శకుడు జె.బి, సినిమాటోగ్రాఫర్ ప్రభాకర్ రెడ్డి, ఎడిటర్ ఉద్ధవ్ ఈ సినిమాకి కూడా పనిచేసారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో భారీగా విడుదల చేసారు. దీపావళి కానుకగా విడుదల అవబోతుంది. ఈ సినిమాతో పాటుగా కృష్ణం వందే జగద్గురుం, తుపాకి కూడా అదే రోజు విడుదలవుతున్నాయి.