విదేశాల్లో జరిగే బన్ని – హరీష్ శంకర్ మూవీ

Allu_Arjunand-Harish-Shanka
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్నాడు. అల్లు అర్జున్, హరీష్ శంకర్ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్స్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాని దాదాపు 30 లేదా అంతకన్న ఎక్కువ రోజులు విదేశాలలో షూటింగ్ నిర్వహించవచ్చునని సమాచారం. ఈ సినిమాని కెనడా లేదా యుఎస్ఎ లో షూట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను ఇంతవరకు అధికారికంగా తెలియజేయలేదు. ఈ సినిమా హరీష్ శంకర్ స్టైల్ లో మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కవచ్చునని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’, హరీష్ శంకర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.

Exit mobile version