సమంతకు ఇక్కడ ఎక్కడాలేని ఫ్యాన్ బేస్ వుంది. భారీ చిత్రాలలో తప్పనిసరి నాయికగా ఎంపికవుతున్న ఈ భామ తన తరంలో అగ్రతారగా వెలుగుతుంది. ఈ భామ తన ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. 3 నెలలో 3 పెద్ద సినిమాలలో సమంత కనిపిస్తుంది. పవన్ ‘అత్హరింటికి దారేది’… ఆ తరువాత ఎన్.టి.ఆర్ తో ‘రామయ్యా వస్తావయ్యా’ చివరిగా నాగచైతన్య ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలలో మేరవనుంది. ఈ సినిమాలలో సమంత అత్యంత అందంగా కనిపించి ఫ్యాన్స్ మతిపోగొట్టనుంది. ఈ విజయ పరంపరను సమంత ఇలాగే కొనసాగిస్తుందా?? ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే చెప్పాలి…