ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయాన్ని అందుకోవడం కూడా ఒక కారణం. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సి ఉండగా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ మూవీ కథపై అనేక ఊహగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ యువ రాజకీయ నాయకుడిగా, బిజినెస్ మాన్ గా కనిపిస్తాడన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఐతే ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎన్టీఆర్ 30మూవీ బడ్జెట్ లో భారీ కోత పడనుంది అంటున్నారు. కరోనా ప్రభావం ఎప్పటికి తగ్గుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మునుపటిలా థియేటర్స్ ద్వారా వందల కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం లేదని నిర్మాతలు భావిస్తున్నారు. దీనితో ఈ మూవీ బడ్జెట్ లో భారీ కోత పెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్స్ తో పాటు నిర్మాణ ఖర్చులలో కోతలు పెట్టనున్నారట.