మాస్ మహారాజ రవితేజ హీరోగా, ‘డాన్ శీను’ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘బలుపు’. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ మరియు అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ 14న మొదలైంది, నేటితో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో శ్రుతి హాసన్, బ్రహ్మానందం మధ్య కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు మరియు అవి చాలా బాగా వచ్చాయని సమాచారం. గోపీచంద్ మలినేని ‘డాన్ శీను’ కన్నా పెద్ద హిట్ రవితేజకి ఇవ్వాలని ఈ స్క్రిప్ట్ ని చాలా పక్కాగా తయారు చేసుకున్నాడు. పి.వి.పి సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.