కామెడీ స్టార్ బ్రహ్మానందం ఎన్నో తెలుగు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి నవ్విస్తుంటారు.ఇప్పటి వరకూ ఆయన ప్రధాన పాత్రలు చేసిన ఎన్నో విజయాలు సాధించాయి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాలో బ్రహ్మానందం పాత్రలో కనిపించనున్నాడు. కందిరీగ శ్రీనివాస్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పూర్తి హాస్యభరితంగా ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సమంత, ప్రణిత ఈ సినిమాలో కనిపించనున్నారు. నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా 2014 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.