‘వకీల్ సాబ్’ను చెక్ చేయడానికి ఆయన వచ్ఛారట

‘వకీల్ సాబ్’ను చెక్ చేయడానికి ఆయన వచ్ఛారట

Published on Nov 9, 2020 9:02 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం మొదలైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సైతం షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్ ఈ వారం మొత్తం జరగనుంది. పవన్ షూటింగ్లో జాయిన్ కావడం, ఆయన క్రేజీ లుక్స్ బయటికి రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయడానికి చిత్ర బృందం ట్రై చేస్తోంది.

అందుకే షూటింగ్ పనులు ఎలా సాగుతున్నాయి తెలుసుకోవడానికి చిత్ర నిర్మాత బోణీ కపూర్ హైదరాబాద్ వచ్చారట. లొకేషన్లోకి వెళ్లి దర్శకుడు వేణు శ్రీరామ్, పవన్ కళ్యాణ్, సహా నిర్మాత దిల్ రాజు, ఇతర చిత్ర బృందాన్ని కలిసి సినిమా ఎంతవరకు వచ్చింది, ఎలా నడుస్తోంది, అవుట్ ఫుట్ క్వాలిటీ ఎలా వస్తోంది లాంటి విషయాలను గమనిస్తారట అయన.

ఇకపోతే కథానాయిక శృతి హాసన్ డిసెంబర్ మొదటి వారం నుండి మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో జాయిన్ కానుంది. వీలైనంతవరకు సినిమాను సంక్రాంతి కానుకగా విడుదలచేయాలని చూస్తున్నారు. అలాగే ఈ వీలైనంత త్వరగా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజా వార్తలు