‘బేబి’ హిందీ రీమేక్.. తప్పుకున్న టాలెంటెడ్ యువ హీరో కారణమిదేనా?

కొన్నాళ్ల కితం మన తెలుగు సినిమా దగ్గర వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిన్న చిత్రం “బేబి” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్యలతో దర్శకుడు సాయి రాజేష్ చేసిన ఈ సినిమా ఊహించని వసూళ్లు అందుకొని దుమ్ము లేపేసింది అయితే ఈ సినిమా సక్సెస్ తో హిందీ రీమేక్ కి కూడా సాయి రాజేష్ కి పిలుపు వచ్చింది.

మరి అక్కడ ప్రముఖ వెర్సటైల్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ హీరోగా స్టార్ట్ అయ్యింది. కానీ ఇపుడు అనూహ్యంగా ఈ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టుగా ప్రకటించడం ఒకింత షాకింగ్ గా మారింది. ఊహించని కారణాలు చేత సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని సాయి రాజేష్ గారితో ప్రయాణం ఎంతో బాగుంది. త్వరలోనే మళ్ళీ మేము కలిసి మ్యాజిక్ చేస్తాం అని బాబిల్ తెలిపాడు.

అంతే కాకుండా సాయి రాజేష్ కూడా ఇదే తరహాలో తన స్పందన రివీల్ చేశారు. అయితే కొన్ని రోజులు కితం బాలీవుడ్ లో జరుగుతున్న కొన్ని పరిస్థితులు మూలాన చాలా ఒత్తిడికి లోనవుతున్నట్టుగా బాబిల్ పోస్ట్ చేసి డిలీట్ చేసేయడం చర్చకి దారి తీసింది. ఇంతలోనే ఈ సినిమా నుంచి తప్పుకోవడం వంటివి దానికి సంబంధించే కారణమా అన్నట్టు అనిపిస్తుంది. ది రైల్వే మెన్ సిరీస్ లో బాబిల్ అద్భుతమైన పెర్ఫామ్సన్ ని చేసి తన తండ్రిని గుర్తు చేసాడు. మరి తాను ఫ్యూచర్ లో మంచి బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.

Exit mobile version