త్రిష ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.!

తమిళ ముద్దుగుమ్మ త్రిష గ్లామరస్ బ్యూటీనే గాక పట్టుదల మరియు ధైర్యం ఉన్న హీరోయిన్. త్రిష ఇటీవలే ఓ పత్రికతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన సంగతులను చెప్పింది. ‘ విజయం అందుకోవడం అంత సులువు కాదు, సులువుగా విజయం వస్తే దానికి విలువ ఉండదు. విజయం వరిస్తుందా లేదా అన్న భయం ఉంటే విజయం దక్కదు. భయం మానేస్తేనే విజయంవరిస్తుందని’ అంటోంది. ప్రస్తుత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని త్రిష తమిళంలో మాత్రం బిజీ గా ఉంటోంది.

తను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో చెబుతూ ‘ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోకపోతే మనం సక్సెస్ అందుకోలేము. నేను నటించడానికి మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. కానీ నేను అదే చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఆ నిర్ణయం నేను తీసుకోకపోయి ఉంటే నేనిప్పుడు ఎలా ఉండేదాన్నో ఊహించుకోవాలంటేనే కష్టంగా ఉందని’ అంది. మనం తీసుకునే నిర్ణయాలే మన స్థానాన్ని నిర్ణయిస్తాయని చెప్పడానికి త్రిష చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. అదే త్రిష కెరీర్ కి ఇంత సక్సెస్ ని అందించింది.

Exit mobile version