అరవింద్ కృష్ణ మరియు డింపిల్ చొప్డే జంటగా నటించిన ‘బిస్కెట్’ ఈ నెలలో విడుదలకానుంది. ఆనీల్ గోపీరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాక సంగీతాన్నికూడా అందించాడు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు మరియు కమెడియన్లు నటించారు. వెన్నెల కిషోర్, అజయ్, ఆలి, ఎం.ఎస్, చలపతి రావు, రఘు మరియు మాస్టర్ భరత్ తదితరులు నటించారు. స్రవంతి మరియు రాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎడిటింగ్ భాద్యతలను మధు రెడ్డి చేపట్టాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయం నిర్మాతలు నమ్మకంగా వున్నారు.