సంక్రాంతికి వాయిదా పడ్డ కార్తీ బిర్యాని

సంక్రాంతికి వాయిదా పడ్డ కార్తీ బిర్యాని

Published on Sep 2, 2013 2:00 PM IST

Biriyani
తన సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన సినిమా ‘బిర్యాని’. ఈ సినిమాని ముందుగా సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలని సంక్రాంతికి వాయిదా వేశారు. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కార్తీ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో తమిళంలో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంచి. ప్రేంజీ అమరెన్, మండి తఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ప్రభు డైరెక్టర్. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ ఈ మూవీని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు.

మాములుగా బిర్యాని తర్వాత రావాల్సిన కార్తీ ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజా’ సినిమా మాత్రం కాస్త ముందుగా దీపావళికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కార్తీ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు