వాయిదాపడిన బిల్లా రంగా

వాయిదాపడిన బిల్లా రంగా

Published on Feb 19, 2014 7:36 PM IST

Billa-Ranga's-release-date-

రాహుల్ వెంకట్, ప్రదీప్ నటించిన బిల్లా రంగా సినిమా మరోసారి వాయిదాపడింది ఈ సినిమా ముందుగా ఫిబ్రవరి 22న విడుదలచేద్దాం అనుకున్నారు. ఆఖరికి ఈ సినిమా ఆరోజు కుడా మనముందుకు రావడంలేదని తేలిపోయింది. త్వరలో అధికారికంగా విడుదల తేదిని ప్రకటించనున్నారు

‘అద్వైతం’ సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రదీప్ మాడుగుల ఈ సినిమాకు దర్శకుడు. కొత్త హీరోయిన్ రిక్షితా జైరాత్ ఈ సినిమాలో నటించనుంది. ఒక పల్లెటూరు ప్రాంతంలో బిల్లా మరియు రంగా అనే ఇద్దరు వ్యక్తుల కధే ఈ సినిమా.

సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. విశ్వేశ్వర్ సినిమాటోగ్రాఫర్. వంశీ కృష్ణ బోయిన, అరవింద్ కుమార్ వన్నాల, సుధీర్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు

తాజా వార్తలు