ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోహెల్..10 లక్షలు ఇచ్చేసాడు!

ఈసారి జరిగినటువంటి బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 4లో మంచి ఇంతకు ముందు ఏ సీజన్లలోని కంటెస్టెంట్స్ రాని పేరు మరియు క్రేజ్ వచ్చింది. అయితే ఇంతకు ముందు వాటిలో కూడా కొంతమందికి మంచి క్రేజ్ వచ్చినప్పటికీ వారిలో పెద్దగా క్లిక్ అయ్యింది ఎవరూ లేరు. కానీ ఈసారి సీజన్లో మాత్రం విన్నర్ అభిజీత్ రన్నర్ అఖిల్ కాకుండా టాప్ 3 కంటెస్టెంట్ సోహెల్ కు కూడా మంచి క్రేజ్ దక్కింది.

చివర్లో అయితే సోహెల్ ఓడినప్పటికీ అతడు కూడా ఒక విన్నర్ అనే రేంజ్ లో పరిస్థితులు మారాయి. మరి ఇదిలా ఉండగా ఈ షో ఫినాలే ఎపిసోడ్ లో సోహెల్ ఓ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. తన క్యాష్ ప్రైజ్ లో 10 లక్షలను హైదరాబాద్ సిటీ క్లబ్ లో పలువురు ప్రముఖులు సమక్షంలో ఒక్కో అనాధాశ్రమానికి రెండేసి లక్షల చొప్పున డొనేట్ చేసాడు. అంతే కాకుండా తన భవిష్యత్తు సంపాదనలో కూడా 10 నుంచి 15 శాతం వరకు చారిటీకే ఇస్తానని మాటిచ్చాడు. ప్రస్తుతం సోహెల్ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు.

Exit mobile version