అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్డేట్.. హీరోయిన్ ఎవరో రివీల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు మరో బిగ్ అప్డేట్ ని ఇస్తున్నట్టుగా నిన్న ఒక క్రేజీ పోస్టర్ తో హైప్ ని రేపిన సంగతి తెలిసిందే.

మరి ఎట్టకేలకి ఈ 11 గంటలకి ఆ అప్డేట్ వచ్చేసింది. అయితే హీరో అల్లు అర్జున్ పై ఎలాంటి అప్డేట్ ని ప్లాన్ చేసారో అదే రీతిలో ఇప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ని అనౌన్స్ చేసేసారు. దర్శకుడు అట్లీ దీపికాకి కథని చెప్తున్న విజువల్స్ ఇంకా కొన్ని కామికల్ గా బ్లాక్ అండ్ వైట్ లో ఆమెపై చూపించిన విజువల్ పూర్తిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ లెవెల్లో ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఇక ఫైనల్ గా తనపై ప్రిపరేషన్ లు యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే అట్లీ గట్టిగానే ప్లాన్ చేసాడని అనిపిస్తుంది. మొత్తానికి సన్ పిక్చర్స్ మాత్రం రోబో లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత మరో ఊహించని ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని చెప్పవచ్చు.

Exit mobile version