బిగ్ ట్రీట్: ‘వీరమల్లు’ ప్రెస్ మీట్ లో ‘పవర్’ సర్ప్రైజ్!

బిగ్ ట్రీట్: ‘వీరమల్లు’ ప్రెస్ మీట్ లో ‘పవర్’ సర్ప్రైజ్!

Published on Jul 20, 2025 9:10 PM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ తదితర స్టార్ నటీనటులు కలయికలో దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు” పార్ట్. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఏమంత రంజుగా సాగడం లేదు అనే డిజప్పాయింట్మెంట్ అభిమానుల్లో ఉంది. అయితే వారికి కొత్త ఉత్సాహం ఇచ్చేలా మేకర్స్ ఓ సాలిడ్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నారు.

రేపు జూలై 21న ఓ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించనున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. పవన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో పాల్గొంటారని టాక్ ఉంది. అయితే సమయం కుదరక అవేవి అంతగా కుదరలేదు కానీ ఇప్పుడు ఫైనల్ గా ప్రెస్ మీట్ అయితే సెట్ అయ్యింది. మరి రేపటి ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు