పవన్ కళ్యాన్ డైరెక్టర్ తో కలవనున్న రవితేజ?

Bheemineni-Srinivas-Rao-to-
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘అన్నవరం’ సినిమాను తీసి, తరువాత ‘సుడిగాడు’ సినిమాతో వెనుతిరిగిచూసుకోవలసి అవసరం లేకుండా వెనుతిరిగివచ్చిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు . తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు రవితేజ తో ఒక సినిమా తియ్యనున్నాడట. ‘సుందరపాండియన్’ అనే తమిళ సినిమా అనువాద హక్కులను సొంతం చేసుకున్నాక ఇక అదే భీమనేని చేస్తున్న తదుపరి సినిమా అని నిర్ధారించేశారు. ఈ స్క్రిప్ట్ పై దర్శకుడు కొన్ని నెలలుగా పనిచేస్తున్నాడు. ఇదిలావుంటే రవితేజకు భీమనేని ఒక కొత్త కధను వినిపించాడని త్వరలో కలిసి సినిమా చేస్తున్నారని ఫిలింనగర్ లో మరో వార్త వినిపిస్తుంది. అసలే మన రవితేజ ఈ మధ్య ‘బలుపు’ విజయంతో జోరుమీద వున్నాడు. గతంలా కాకుండా రవితేజ ఈసారి కధల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చూద్దాం మరి ఎవరి మాట నిజమవుతుందో …

Exit mobile version