టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ లు హీరోలుగా దర్శకుడు విజయ్ కనక మేడల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే భైరవం. తమిళ సూపర్ హిట్ చిత్రం గరుడన్ కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుకుంటుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా దర్శకుడు ఓ కాంట్రవర్సీ కూడా ఎదుర్కొంటుండగా మరోపక్క సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ గా సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ అందించారట. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా బయటకి వచ్చింది. దీనితో భైరవం మొత్తం 2 గంటల 35 నిమిషాల నిడివితో రాబోతుందట. ఈ మే 28న రాబోతున్న సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి మరి.