నాగార్జున పుట్టినరోజున విడుదలకానున్న భాయ్

Nagarjuna-Bhai

నాగార్జున సరికొత్త సినిమా ‘భాయ్’ మరో రెండునెలలో విడుదలకు సిద్ధమవుతుంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా నాగార్జున పుట్టినరోజునాడు అంతే ఆగష్టు 29న విడుదల చెయ్యడానికి చూస్తున్నారట. త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. వీరబధ్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన ఓల్డ్ సిటీ సెట్ లో జరుగుతుంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. సోను సూద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నటాలియ కౌర్, హంసనందిని ప్రత్యేక గీతాలలో నటిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ ను నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. జూలై లో ఆడియో విడుదలకావచ్చు

Exit mobile version