వారం ఆలస్యంగా రానున్న భాయ్ ఆడియో?

Bhai
‘కింగ్’ నాగార్జున హీరోగా నటిస్తున్న భాయ్ సినిమా ఆడియో ఒక వారం ఆలస్యంగా సెప్టెంబర్ రెండవ వారంలో రానుంది. మొదటగా ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 1న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా ఆడియో రిలీజ్ ని వాయిదా వేసారు. నాగార్జున రెండు విభిన్న గెటప్స్ లో కనిపించిననున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. నాగార్జున – దేవీశ్రీ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్’, ‘మన్మధుడు’, ‘ ఢమరుకం’ సినిమాల ఆడియో మంచి హిట్ అయ్యాయి దాంతో ఈ సినిమా ఆడియో కూడా ఆ స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జర నాగార్జున చెల్లెలిగా కనిపించనుంది. దసరా కానుకగా సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version