అదిరిపోయే బెల్లంకొండ స్టైలిష్ హౌస్

Suresh
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నిర్మించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాయి. ఇప్పుడు ఆయన విలాసవంతమైన కొత్త ఇంటిని ఫిల్మ్ నగర్ లో నిర్మిస్తున్నాడు. ఈ ఇల్లు సానియా మీర్జా ఇంటికి, అపోలో హాస్పిటల్ కి దగ్గరలో వుంది. ఈ ఇంటిని ఆయన చాలా విలాసవంతంగా, రాష్ట్రంలోనే మంచి ఆర్ట్ టెక్నోలాజీతో, ఖరీదైన ఫీచర్స్ తో నిర్మించాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఇంటిని పరిశ్రమలోని వారికి అతని స్నేహితులు చూపించడం జరిగింది. బెల్లంకొండ సురేష్ తన కొడుకు శ్రీనివాస్ ని హీరోగా ఈ సంవత్సరం లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘రభస’ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version