బ్రేకింగ్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్.!

ఈ ఏడాది కరోనా మూలాన అంతా ఏ స్థాయిలో విస్తుపోయారో అందరికీ తెలిసిందే. తీరని నష్టాలు కూడా దాని వల్ల జరిగాయి. అయితే ఈ ప్రమాద కారి వైరస్ ప్రభావ ఇప్పుడు కొద్దిగా తగ్గుతూనే విస్తరిస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖులకు కూడా ఈ మధ్యన పాజిటివ్ లు వస్తుండడం అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొల్పుతుంది.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవికి కోవిడ్ పాజిటివ్ అనే వార్త ఎంత కలకలం రేపిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత ఏమీ లేదని తేలింది. మతి ఇప్పుడు మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ విర్ధారణ అయ్యినట్టుగా తెలిపారు. దీనితో చరణ్ నుంచి ఈ ఊహించని వార్త రావడంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.

అయితే చరణ్ తనకు పాజిటివ్ అయితే వచ్చింది కానీ ఎలాంటి లక్షణాలు లేవని ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ తీసుకున్నాని ఈ మధ్యన తనని కలిసిన ప్రతీ ఒక్కరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చరణ్ సూచించారు. అంతే కాకుండా త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా బయటకొస్తానని చరణ్ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చారు. మరి చరణ్ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

Exit mobile version