ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియా ఈ ఏడాదికి గాను టాప్ టెన్ తెలుగు హీరోల లిస్ట్ విడుదల చేసింది. అనేక మంది అభిప్రాయాలను సేకరించిన ఆర్మాక్స్ మీడియా తెలుగులో అత్యంత ప్రజాదరణ ఉన్న హీరోగా బన్నీ నిలిచాడు. ఆయన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురంలో భారీ విజయం అందుకోవడంతో పాటు ఆయన ఇమేజ్ కి బూస్ట్ ఇచ్చింది. ఆ సంస్థ సర్వే ప్రకారం…రెండవ స్థానములో మహేష్ నిలిచాడు.
మూడవ స్థానములో ప్రభాస్, నాలుగవ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలువగా ఎన్టీఆర్ ఐదవ స్థానానికి పరిమితం అయ్యాడు. ఈ సర్వేలో చిరంజీవి ఆరవ స్థానంలో ఉండగా విజయ్ దేవరకొండ ఏడు, నాని ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ఇక తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ పదవ స్థానంలో వెంకటేష్ నిలిచారు. ఇక టాలీవుడ్ నుండి హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ సమంత దక్కించుకోగా కాజల్, అనుష్క, రకుల్ మరియు రష్మిక టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నారు.
Ormax Stars India Loves (Telugu): Top 10 male stars in Telugu cinema (May 2020) #OrmaxSIL #OSILTelugu pic.twitter.com/0pM4DGz64o
— Ormax Media (@OrmaxMedia) June 25, 2020