షాద్ నగర్ నాకిచ్చిన గిఫ్ట్ పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్

Pawan-and-Bandla-Ganesh
ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చెయ్యాలని తపించే నిర్మాత బండ్ల గణేష్. అందుకే బ్లాక్ బస్టర్ అనేది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. మన బండ్ల గణేష్ గారు ఎప్పుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ గారని చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఆయన నిర్మాతగా చేసిన ఐదు సినిమాలో రెండు సినిమాలను పవన్ తోనే నిర్మించడం విశేషం. అందులో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచిందన్న విషయం మనందరికీ తెలిసిందే.

తాజాగా బండ్ల గణేష్ పవన్ గారితో తన అనుబందం ఎప్పుడు మొదలయ్యింది అనే దాని గురించి చెబుతూ ‘ ‘సుస్వాగతం’ సినిమా నుంచి నాకు పవన్ గారితో పరిచయం ఉంది. ఆయన ఒకసారి షాద్ నగర్లో ఒక భూమిని కొనడానికి వచ్చినప్పుడు నేను సాయం చేసాను. అప్పుడు నేను చేసిన బిజినెస్ చూసిన పవన్ నన్న నిర్మాతని చేస్తానని మాటిచ్చాడు. హా అందరూ చెప్తార్లెండి అని అనుకున్నాను. కానీ అయన చెప్పినట్టుగానే అనను నిర్మాతని చేసి, ఇండస్ట్రీలో నాకంటూ ఓ ప్రత్యేక హోదాని కల్పించారు. మా ఊరే లేకపోతే అసలు పవన్ గారితి అనుబంధం ఎర్పడేదా? అందుకే షాద్ నగర్ నాకిచ్చిన గిఫ్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ అని ఆన్నారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ విక్టరీ వెంకటేష్ – రామ్ చరణ్ తో కలిపి ఓ మల్టీ స్టారర్ సినిమా నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి కృష్ణవంశీ డైరెక్టర్.

Exit mobile version