మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బలుపు’ విడుదలైన అన్ని చోట్లా బాగా నడుస్తుంది. ఇక్కడేకాక అమెరికాలో కూడా ఈ సినిమా వసూళ్ళు బాగున్నాయని సమాచారం. అక్కడ ఈ సినిమా 2కోట్ల మార్కును తాకేందుకు దగ్గరగావుంది.
శనివారం వరకు అందిన సమాచారం ప్రకారం 207,700 అమెరికన్ డాలర్లను సంపాదించింది. ఆదివారం ఈ మార్కు 300,000 అమెరికన్ డాలర్లను అందుకుంటుందని అంచనా. ఈ చిత్రం ఇప్పటికే రవితేజ ఆఖరి హిట్ అయిన ‘మిరపకాయ్’ కలెక్షన్లను(250,000 అమెరికన్ డాలర్లను) దాటింది. ట్రేడ్ పండితుల విశ్లేషణ ప్రకారం ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్న అందరూ లాభాలరుచిని చూస్తారట.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్, అంజలి హీరోయిన్స్. పి.వి.పి సినిమా ద్వారా ఈ చిత్రం విడుదలైంది