రవితేజ ‘బలుపు’కి ఎ సర్టిఫికేట్

Balupu (6)

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. శృతి హాసన్ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగా ఉండడం, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువగానే ఉన్నందువల్ల ఈ సినిమాకి ఎ సర్టిఫికేట్ వచ్చినట్లు సమాచారం. రవితేజ చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి పబ్లిక్ లో మంచి క్రేజ్ ఉంది, అలాగే మూవీలో బ్రహ్మానందం కామెడీ సినిమాకి హైలైట్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. పివిపి సినిమా బ్యానర్ వారు నిర్మించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం అనగా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version