‘ఆదిత్య 369’ సీక్వేలే మరో మాట లేదు.!

‘ఆదిత్య 369’ సీక్వేలే మరో మాట లేదు.!

Published on Nov 22, 2025 9:00 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం తన భారీ సీక్వెల్ చిత్రం అఖండ 2 తో రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తన సాలిడ్ లైనప్ తో తాను బిజీగానే ఉన్నారు. కానీ తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కానీ తన సినిమా అనౌన్స్ అయ్యి ఏడాది దాటిపోయినప్పటికీ ఎలాంటి ప్రోగ్రెస్ దాని నుంచి కనిపించలేదు.

కానీ తన ఎంట్రీపై మాత్రం బాలయ్య సాలిడ్ క్లారిటీ తాను ఇంకా మోక్షు కూడా ఆదిత్య 369 సీక్వెల్ చేస్తున్నామని అదే మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అంటూ మరో మాట లేదన్నట్టుగా లేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ గా ఈ సినిమా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. కానీ అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్నగా మారింది. అలాగే దీనిని బాలయ్యే డైరెక్ట్ చేస్తారనే టాక్ కూడా ఉంది. మరి ఇదంతా ఎప్పటికి సెటిల్ అయ్యి మొదలవుతుందో చూడాలి.

తాజా వార్తలు