నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ 2 తాండవం కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఇప్పుడు వచ్చేసింది. మరి ఈ సాంగ్ మాత్రం అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉందని చెప్పి తీరాలి.
కంప్లీట్ గా థమన్ అప్డేట్ చేసిన ట్యూన్ తో దుమ్ము లేపేసాడు అని చెప్పాలి. మరింత పదునైన పదాలతో సరికొత్త విజువల్స్ తో మేకర్స్ ఈ పాటను అద్భుతంగా ప్రెజెంట్ చేయడం జరుగింది. ఇక అఘోర గెటప్ లో బాలయ్య కొత్త అవతారం తనపై చూపించిన మాస్ విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కి మరోసారి ఫీస్ట్ ఇచ్చేలా ఉన్నాయి. సో మొత్తానికి మాత్రం అఖండ 2 నుంచి ఫస్ట్ సింగిల్ క్రేజీ హిట్ అనే చెప్పాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


