మస్కట్ లో స్టెప్స్ వేసిన బాలకృష్ణ

మస్కట్ లో స్టెప్స్ వేసిన బాలకృష్ణ

Published on Feb 6, 2014 8:31 AM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఇటీవలే మస్కట్ లో ఓ సాంగ్ షూట్ చేసిన ఈ చిత్ర టీం మరో సాంగ్ షూట్ కోసం దుబాయ్ కి షిఫ్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ మరి కొద్ది వారాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఈ షెడ్యూల్ లో అక్కడ ఎడారిలో ఓ చేజ్ సీన్ కూడా తీయనున్నారు.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో మార్చిలో విడుదల కానుంది. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మార్చి చివర్లో గానీ లేదా ఏప్రిల్ మొదట్లో గానీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

‘లెజెండ్’ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ మరియు హై వోల్టేజ్ డ్రామా సీన్స్ ఉంటాయని అవి బాలయ్య ఫ్యాన్స్ కి బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు