మార్చ్ లో లెజెండ్ ఆడియో

మార్చ్ లో లెజెండ్ ఆడియో

Published on Feb 6, 2014 1:45 AM IST

Legend_First_Look(1)
బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ సినిమా త్వరలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ పహీరోయిన్స్. జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నాడు. గతంలో బాలయ్యబాబు, బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన సింహా సినిమా మంచి విజయం సాధించింది

సమాచారం ప్రకారం లెజెండ్ సినిమా మార్చ్ మొదటి వారంలో విడుదలకానుంది. దేవి మొదటిసారిగా బాలయ్యబాబుకు స్వరాలను అందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను ప్రకటించగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. బాలయ్యబాబు కొత్త లుక్ అభిమానులకు చేరువయ్యింది. ఈ సినిమాను అధికభాగం వైజాగ్, హైదరాబాద్ లో చిత్రీకరించారు

మార్చ్ 28న గానీ ఏప్రిల్ 4న గానీ ఈ సినిమా మనముందుకు రానుంది. వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటి తోకలిసి 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు