సనాతన ధర్మ రక్షణ కోసమే ‘అఖండ 2’

Bala Krishna

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా తండ్రిగారి ఆశీస్సులే. ఇప్పుడంటే సినిమా ఒక అవసరంగా మారింది. మంచి కంటెంట్ అందించాల్సిన బాధ్యత ఇండస్ట్రీపై ఉంది. కోవిడ్ సమయంలో ఇండస్ట్రీ కష్టాల్లో పడినప్పుడు అఖండ భారీగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి అందరికీ ఊరట ఇచ్చింది” అని తెలిపారు.

“మేము కొన్ని క్లిప్స్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి చూపించాం. ఆయన ఎంతో అభినందించారు. అఖండ 2లో సనాతన ధర్మ పరిరక్షణ ప్రధానంగా ఉండబోతోంది. అఘోరాలు చాలా ఏళ్లుగా మన ధర్మాన్ని కాపాడుతున్నారు. నా సినిమాల్లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. అఖండ 2 కూడా అదే శైలిలో పయనిస్తుంది” అని చెప్పారు.

Exit mobile version