మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమా మార్చి15న విడుదలకానుంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ రోజు రాత్రి హైదరాబాద్లో కొన్ని ప్రీమియర్ షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలకి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను, సిని ఇండస్ట్రీ వారిని ఆహ్వానించనున్నారు. ఈ సినిమాలో మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయ్, అర్చన కవి లు హీరో హీరోయిన్స్ గా నటించారు. నిజ జీవితంలో జరిగిన వాటిని ఆదారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. వాసు మల్టీడైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో డా.ఎంవికె రెడ్డి ఈ సినిమాని నిర్మించాడు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీలు ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.