200 మందితో షూటింగ్ చేస్తున్న రాజమౌళి

200 మందితో షూటింగ్ చేస్తున్న రాజమౌళి

Published on Sep 2, 2013 8:10 AM IST

Bahubali
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ 200 మందితో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిన్న మొదలైన ఈ షూటింగ్ మరో రెండు రోజులపాటు జరగనుంది. నిన్న షూటింగ్ మొదలయ్యే సమయానికి కాస్త వర్షం పడేలా ఉనింది, దాంతో షూటింగ్ కి అంతరాయం కలుగుతుందని అనుకున్నారు. కానీ వరుణుడు ఎలాంటి అంతరాయం కలిగించక పోవడంతో నిన్న సాఫీగా షూటింగ్ జరిగిపోయింది. మరో రెండు రోజులు కూడా వాతావరణం ఇలానే సహకరించాలని రాజమౌళి కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా కనిపించనుంది. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు