చారిత్రాత్మక నేపధ్యంలో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా రెండో షెడ్యూల్ ఆగష్టు మధ్యనుండి మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు తమ్ముడిగా రానా నటిస్తున్నాడు. అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది
తెలుగు సినీ చరిత్రలోనే ‘బాహుబలి’ అత్యధిక బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. రాజమౌళి ఈ సినిమాను ఒక అద్భుత దృశ్యకావ్యంగా మలచడానికి చాలా తపన పడుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అర్క మీడియా బ్యానర్ పై నిర్మాణమవుతుంది
‘బాహుబలి’ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రఫీ భాద్యతలు చేపట్టారు