వరల్డ్ వైడ్ అన్ని ఎపిక్ ఫార్మాట్స్ లో ‘బాహుబలి’ రీరిలీజ్

Baahubali The Epic

లేటెస్ట్ గా పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ఉన్న అవైటెడ్ రీరిలీజ్ చిత్రమే “బాహుబలి ది ఎపిక్”. తెలుగు ఇంకా ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన రెండు సినిమాలు కలిపి ఒకే చిత్రంగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ఇప్పుడు గ్రాండ్ లెవెల్లో తీసుకొస్తున్నారు. ఇలా హీరో ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా మిగతా ఆడియెన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి అంతే రీతిలో ఎపిక్ ప్లానింగ్ లని మేకర్స్ చేస్తున్నారు.

వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో ఉన్నటువంటి ముఖ్య ఫార్మాట్ లు అన్నిట్లో ఈ సినిమాని అప్డేట్ చేసి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఐమ్యాక్స్, డాల్బీ సినిమా, 4డిఎక్స్, డి బాక్స్ ఇంకా ఎపిక్యూ, ఐస్ థియేటర్స్ అలానే హైదరాబాద్ బిగ్గెస్ట్ స్క్రీన్ పీ సి ఎక్స్ ఫార్మాట్ లలో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఒక ఎపిక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని బాహుబలి ది ఎపిక్ అందించనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ రీరిలీజ్ ఈ అక్టోబర్ 31న పాన్ ఇండియా భాషల్లో కాబోతుంది.

Exit mobile version