రజినీ ‘విక్రమ సింహా’ ఆడియో రిలీజ్ డేట్

రజినీ ‘విక్రమ సింహా’ ఆడియో రిలీజ్ డేట్

Published on Feb 17, 2014 7:05 PM IST

vikram-simha
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’. తెలుగులో ‘విక్రమ సింహా’గా రానుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. అలాగే ఈ సినిమా ఆడియోని ముందుగా ఈ నెల 14 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.

ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తమిళ ఆడియోని మార్చి 9న రిలీజ్ చేయనున్నారు. అలాగే తెలుగు వెర్షన్ ఆడియోని మార్చి 10న హైదరాబాద్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ రోస్ ఇంటర్నేషనల్ – మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి సౌందర్య అశ్విన్ దర్శకత్వం వహించారు.

‘కొచ్చాడియాన్’ సినిమా పాండ్యన్ కింగ్ అయిన కొచ్చాడియాన్ రణదీరన్ జీవిత కథ. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు