కొత్త కథలను ప్రోత్సహిస్తేనే మరికొన్ని కొత్తచిత్రాలు వస్తాయి : బాలకృష్ణ

కొత్త కథలను ప్రోత్సహిస్తేనే మరికొన్ని కొత్తచిత్రాలు వస్తాయి : బాలకృష్ణ

Published on Aug 1, 2012 4:45 PM IST


కొత్తరకమైన కథ, కథనాలతో వచ్చిన సినిమాలను సినీ అభిమానులు ఆదరించి, ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీ నుండి మరికొన్ని మంచి చిత్రాలు వస్తాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవలే జరిగిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ ప్రెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ ఎప్పుడైతే నిర్మాతలు సరికొత్త కథలని మరియు అంశాలను ఎంచుకొని తీసిన సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలి. అప్పుడే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి కొత్త రకమైన సినిమాలు వస్తాయని’ ఆయన అన్నారు.

మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి తను సిద్దమని, అప్పుడే అలాంటి కొత్త కథలతో వచ్చే దర్శకులను మరియు నిర్మాతలను ప్రోత్సహించినట్లు అవుతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘శ్రీమన్నారాయణ’ త్వరలోనే విడుదల కానుంది మరియు ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజా వార్తలు