వేసవి నుండి అట్లీ, షారుక్ సినిమా

వేసవి నుండి అట్లీ, షారుక్ సినిమా

Published on Feb 13, 2020 1:18 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఛాన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న ఆయన ఆ గ్యాప్లో చాలా కథలే విన్నారు. వాటిలో సౌత్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నాయి. ఆ కథల నుండి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్ ఈ 2020 వేసవిలో మొదలుకానుంది. అట్లీ అంటేనే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. షారుక్ సైతం హిందీ ప్రేక్షకులు యాక్షన్ చిత్రాల వైపు మొగ్గుచూపుతుండటంతో అట్లీయే సరైన దర్శకుడని ఆయనతో చిత్రం కమిటయ్యారు. ఇక ఆయన అభిమానులైతే కింగ్ ఖాన్ రీఎంట్రీ అట్లీతో చేస్తుండటంతో చాలా ఆసక్తికరంగా ఉంది.

తాజా వార్తలు