నటుడు, నిర్మాత అశోక్ కుమార్ చేతుల మీదుగా ‘సందిగ్ధం’ చిత్రం టీజర్ శుక్రవారం నాడు విడుదలైంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పైన సంధ్య తిరువీధుల నిర్మాతగా, పార్ద సారథి కొమ్మోజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ దేవ్, కాజల్ తివారి, జీవ కోచెర్ల వంటి వారు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
టీజర్ గ్రిప్పింగ్‌గా ఉందని, ఇందులో వింత ఘటనలు, ప్రేమ కథ ఉన్నట్టుగా కనిపిస్తోందని అశోక్ కుమార్ ఈ సందర్భంగా ప్రశంసించారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సహజంగా ఉన్నాయని, జానర్‌కి సరిపోయే ఆర్ఆర్ కూడా బాగుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న చిత్రాలు విజయం సాధించడం కష్టమే అయినా, మంచి టాక్ వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారని తెలిపారు. భార్యాభర్తలైన సంధ్య, పార్దు కష్టపడి తీసిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
హీరో నిహాల్ మాట్లాడుతూ దర్శకుడు పార్ద సారథి కథ చెప్పిన విధానం నచ్చి తాను ఈ మూవీలోకి వచ్చానని తెలిపారు. పార్దు, సంధ్య ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు పార్ద సారథి మాట్లాడుతూ ఈ కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఇలాంటి కథ ఇంతవరకు రాలేదని చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు తన భార్య సంధ్య వెన్నంటి నిలిచి, ఈ చిత్రాన్ని నిర్మించిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని చిత్ర యూనిట్ కోరింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
