RT76పై హీరోయిన్ సాలిడ్ అప్డేట్

RT76పై హీరోయిన్ సాలిడ్ అప్డేట్

Published on Oct 22, 2025 10:00 AM IST

RT76

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ క్రమంలో రవితేజ నెక్స్ట్ చిత్రం RT76పై హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతుందని.. అక్కడ ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు ఆమె కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ పాట షూటింగ్‌తో స్పెయిన్ షెడ్యూల్ పూర్తవుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా, ఈ RT76 చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు