దర్శకుడుగా 50 కోట్లు హీరోగా 30 కోట్లు అందుకుంటున్న లోకేష్?

కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ దర్శకుల్లో కొన్ని సినిమాల తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. అయితే లోకేష్ తను సినిమాకి దర్శకుడుగా 50 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టు ఆ మధ్య కన్ఫర్మ్ చేసాడు. మరి తను ఇప్పుడు హీరోగా కూడా మారిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే హీరోగా కూడా తాను భారీ రెమ్యునరేషన్ తీసుకుమతున్నట్టు టాక్ వినిపిస్తోంది. హీరోగా తను తన మొదటి సినిమాకే 35 కోట్ల మేర సాలరీగా అందుకుంటున్నాడట. దీనితో ఈ టాక్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అంతే కాకుండా ఒక డెబ్యూ హీరోగా ఈ భారీ మొత్తాన్ని అందుకుంటున్న ఏకైక హీరోగా తను నిలిచినట్టు కూడా టాక్. సో ఇలా దర్శకుడుగా హీరోగా కూడా లోకేష్ ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్నాడని చెప్పాలి.

Exit mobile version