“ఇట్స్ మై లవ్ స్టొరీ” ఫేం అరవింద్ కృష్ణ హీరోగా అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో “బిస్కెట్” అనే ఒక చిత్రం రానుంది. స్రవంతి మరియు రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో మొదలయ్యింది. ఈ చిత్రానికి కేంద్రమంత్రి చిరంజీవి క్లాప్ కొట్టగా వడ్డేపల్లి నర్సింగరావు కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశాన్ని అరవింద్ కృష్ణ మరియు వెన్నెల కిషోర్ మీద తెరకెక్కించారు. మనకు కావలసిన పని కోసం ఎవరిని అయిన మాయ చేసేందుకు చేసే పనిని “బిస్కెట్” అంటారు. యువత పాకెట్ మనీ కోసం ఇంట్లో బిస్కెట్ లు వేస్తే ఆఫీసు లో ప్రమోషన్ కోసం బాస్ వద్ద బిస్కెట్ లు వేస్తారు ఈ చిత్రంలో ఎవరు ఎవరికీ ఎందుకోసం బిస్కెట్ లు వేసారు అన్నదే ఆసక్తికరం అని దర్శకుడు తెలిపారు. అనిల్ జి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చెయ్యాలని నిర్మాతలు భావిస్తున్నారు.