ఆస్కార్ అవార్డు విన్నర్, ఇండియన్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్ రెహమాన్ ఒక సినిమాకి మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడంటే ఆ సినిమా సగం సక్సెస్ అయినట్టే. అలాంటి ఎ.ఆర్ రెహమాన్ లవర్ బాయ్ సిద్దార్థ్ సినిమాకి మ్యూజిక్ చేయనున్నాడు. శంకర్ శిష్యుడు వసంతబాలన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. వసంత బాలన్ రెహమాన్ ని కలిసి చెప్పిన కథ నచ్చడంతో మ్యూజిక్ చేయడానికి అంగీకరించారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఎ.ఆర్ రెహమాన్ మణిరత్నం డైరెక్షన్లో రానున్న ‘కడల్’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.